రైతులను పట్టించుకోని ప్రభుత్వం
ABN , First Publish Date - 2023-12-10T21:52:03+05:30 IST
తుఫాన్ ప్రభావంతో పం టలు నష్టపోయిన రైతులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం మిన్నకుం డటం సమంజసం కాదని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అన్నారు. సంతమాగులూరు, బల్లికురవ, అద్దంకి మండలాలలోని పలు గ్రామాల లో వర్షానికి దెబ్బతిన్న పంట పొలాలను ఆదివారం ఎమ్మెల్యే రవికుమార్ స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. పంటనష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈక్రాప్‌తో సంబంధం లేకుండా పంట
నష్టపోయిన వారందరికీ పరిహారం చెల్లించాలి
ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్
అద్దంకి/సంతమాగులూరు, డిసెంబరు 10: తుఫాన్ ప్రభావంతో పం టలు నష్టపోయిన రైతులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం మిన్నకుం డటం సమంజసం కాదని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అన్నారు. సంతమాగులూరు, బల్లికురవ, అద్దంకి మండలాలలోని పలు గ్రామాల లో వర్షానికి దెబ్బతిన్న పంట పొలాలను ఆదివారం ఎమ్మెల్యే రవికుమార్ స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. పంటనష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. సంతమాగులూరు మండలం చవిటిపాలెం, తంగేడు మల్లిలో అరటి, మిర్చి, వంగ, వరి పంటను, బల్లికురవ మండలం వి.కొ ప్పెరపాడులో మొక్కజొన్న, అద్దంకి మండలం గోవాడ, సాధునగర్, చినకొత్తపల్లి, శ్రీనివాసనగర్‌లో మొక్కజొన్న, మిర్చి పంటలను పరి శీలించారు.
ఈసందర్భంగా ఎమ్మెల్యే రవికుమార్ మాట్లాడుతూ రబీ సీజన్‌కు సంబంధించి పంట నమోదులో ప్రభుత్వం జాప్యం చేస్తే ఊరుకునేది లేదన్నారు. పంటల బీమా చెల్లించకుండా జగన్మోహన్‌రెడ్డి రైతులను మో సం చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ ఫసల్ బీమాతో రాష్ట్ర ప్రభుత్వం ఏమేరకు రైతులకు సాయం చేసిందో తెలియజేయాలన్నారు. నిబం ధనలు పక్కనబెట్టి ఈక్రాప్‌తో సంబంధం లేకుండా పంటలు నష్టపోయి న రైతులందరికి నష్టపరిహారం అందజేయాలన్నారు. ఉద్యాన, వాణిజ్య పంటలకు తీవ్రనష్టం వాటిల్లిందన్నారు. తుఫాన్ రైతులకు విషాదం మి గిల్చిందన్నారు. ఎక్కువ మంది దళిత రైతులు కౌలుకు తీసుకొని పంట లు సాగు చేశారని చెప్పారు. నిబంధనల పేరుతో పరిహారం అందిం చ కుండా వ్యవహరిస్తున్నారన్నారు. రైతులకు సకాలంలో సాగు నీరు ఇచ్చి ఉంటే అక్టోబరు, నవంబర్ నెలలో పంట చేతికి వచ్చేదన్నారు. సా గు నీరు ఇవ్వటం లో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఈఏడాది తీవ్రమైన కరువు ఏర్పడి పొలాలు బీడు పడినా కొంచెం కరువు మాత్రమే ఉందని కరువు మండలాలను తూతూ మం త్రంగా ప్రకటించారన్నారు. రైతుల పట్ల బాధ్యత లేని అసమర్ధ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన అవసరం ఉందన్నారు.
కార్యక్రమంలో టీడీపీ నేతలు మానం మురళీమోహన్‌దాస్, పుట్టా సాంబశివరావు, దూపాటి ఏసోబు, ధూళిపాళ్ళ కృష్ణ, వెంకటరావు, ఉ మామహేశ్వరరావు, గంజి శ్రీను, నూతి ప్రసాద్, మాకినేని కొండలు, గణ పతి, శ్యామలరావు, యడవల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.