నవ్వుల ఆట
ABN , Publish Date - Dec 28 , 2023 | 11:24 PM
వైసీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం నవ్వులపాలవుతోంది. మండలంలోని కెల్లంపల్లి, పులిపాడు, పెద ఉల్లగల్లు, పసుపుగల్లు, జమ్మలమడక, సింగనపాలెం, శంకరాపురం, పోలవరం, ముండ్లమూరు, వేముల గ్రామాల్లో కబడ్డీ, వాలీబాల్, క్రికెట్ ఆటలు నిర్వహించారు.
ఆడుదాం ఆంధ్రలో వలంటీర్లు, డీలర్లు, డ్వాక్రా మహిళలు
ముండ్లమూరు, డిసెంబరు 28 : వైసీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం నవ్వులపాలవుతోంది. మండలంలోని కెల్లంపల్లి, పులిపాడు, పెద ఉల్లగల్లు, పసుపుగల్లు, జమ్మలమడక, సింగనపాలెం, శంకరాపురం, పోలవరం, ముండ్లమూరు, వేముల గ్రామాల్లో కబడ్డీ, వాలీబాల్, క్రికెట్ ఆటలు నిర్వహించారు. అయితే క్రీడాకారులు లేకపోవడంతో అధికారుల వద్ద మెప్పు కోసం గ్రామంలో ఉన్న ప్రజాప్రతినిధులైన సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, వార్డు మెంబర్లతోపాటు డ్వాక్రా మహిళలు, రేషన్‌షాపు డీలర్లు ఆటలు ఆడారు. దీంతో కార్యక్రమం పూర్తిగా పక్కదారి పట్టింది. గురువారం కెల్లంపల్లిలో సర్పంచ్ జమ్ముల గురవయ్య, రేషన్ షాపు నిర్వహిస్తున్న డీలర్లు, వలంటీర్లు, బయట వ్యక్తులు ఆటలు ఆడటం కన్పించింది.