అభ్యంతరాల వెల్లువ

ABN , First Publish Date - 2023-06-01T01:57:05+05:30 IST

జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ప్రాథ మిక సీనియారిటీ జాబితాపై 368 అభ్యంతరాలు వచ్చాయి. వీటిల్లో 170 పరిష్కరిం చినట్లు డీఈవో పి.రమేష్‌ తెలిపారు.

అభ్యంతరాల వెల్లువ

టీచర్ల బదిలీల దరఖాస్తులపై ఇదీ పరిస్థితి

368కు గాను 170 పరిష్కారం

ఒంగోలు(విద్య), మే 31 : జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ప్రాథ మిక సీనియారిటీ జాబితాపై 368 అభ్యంతరాలు వచ్చాయి. వీటిల్లో 170 పరిష్కరిం చినట్లు డీఈవో పి.రమేష్‌ తెలిపారు. జిల్లాలో బదిలీలకు 6,066 మంది టీచర్లు దరఖాస్తు చేశారు. వాటిని పరిశీలించిన అధికారులు 29వ తేదీ సాయంత్రం ప్రాథమిక సీనియారిటీ జాబితాలను విడుదల చేశారు. వాటికి సంబంధించిన అభ్యంతరాలను మంగళవారం రాత్రి వరకు టీచర్లు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. మొత్తం 369 మంది నుంచి అభ్యంతరాలు వచ్చాయి. వీటిల్లో ప్రధానంగా టీచర్ల పునర్విభజనలో తప్పనిసరిగా బదిలీ కావాల్సిన వారు వేసుకున్న పాయింట్లపైనే ఉన్నాయి. వీటి విషయంలో టీచర్లకు స్పష్టత లేకపోవడంతో ఎవరికి తోచినట్లు వారు పాయింట్లు వేసుకున్నారు. కొందరు పాత స్టేషన్‌ పాయింట్లు కూడా వేసుకోవడంతో వారికి అధికంగా వచ్చాయి. ఎవరికి పాత స్టేషన్‌ పాయింట్లు ఇవ్వా లో కూడా స్పష్టత కరువైంది. అదేవిధంగా ప్రిఫరెన్షియల్‌ కేటగిరీల్లో కూడా కొంత గందరగోళం నెలకొంది. కేవలం 11 రకాల ప్రాధాన్యత కేటగిరీలను బదిలీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ అంశాలకు అదనంగా ఇంకేమైనా ఉంటే కూడా దర ఖాస్తు చేసుకుంటే బదిలీల్లో వీటిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో కొందరు అదనపు పాయింట్లే లక్ష్యంగా జీవోలో లేని వ్యాధులు ఉన్నట్లు దరఖాస్తుల్లో పేర్కొన్నారు. బుధవారం సాయంత్రానికి 170 అభ్యంత రాలు పరిష్కారమయ్యాయి. గురువారం కూడా గడువు ఉండటంతో అన్నీ పరిష్కారమవుతాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2023-06-01T01:57:05+05:30 IST