విఠలాపురం సర్పంచ్‌పై అధికార దుర్వినియోగం, చీటింగ్‌ కేసు నమోదు

ABN , First Publish Date - 2023-02-06T23:13:24+05:30 IST

పాధి హామీ పథకం నిధుల దుర్వినియోగానికి పాలడిన విఠలాపురం గ్రామ సర్పంచ్‌ మారం ఇంద్రసేనారెడ్డి(పదవి నుంచి సస్పెండ్‌ చేశారు), డూప్లికేట్‌ డాక్యుమెంట్లు సమర్పించి బిల్లులు తీసుకున్న కోట నాగార్జునరెడ్డిలపై తాళ్లూరు పోలీ్‌సస్టేషన్‌లో సోమవారం చీటింగ్‌, అధికార దుర్వినియోగం కేసు నమోదైంది. ప్రభు త్వం విడుదల చేసిన నిధులను పనులు చేసిన వారికి కాకుండా ఇతరులకు చెల్లించి మోసానికి పాల్పడ్డారని ఎంపీడీవో కె.వై.కీర్తి ఫిర్యాదు మేరకు ఎస్సై బి.ప్రేమ్‌కుమార్‌ కేసు నమోదు చేశారు.

విఠలాపురం సర్పంచ్‌పై అధికార దుర్వినియోగం, చీటింగ్‌ కేసు నమోదు
మారం ఇంద్రసేనారెడ్డి

దొంగ పత్రాలు సృష్టించి బిల్లులు పొందిన మరొకరిపైనా...

తాళ్లూరు, ఫిబ్రవరి 6 : ఉపాధి హామీ పథకం నిధుల దుర్వినియోగానికి పాలడిన విఠలాపురం గ్రామ సర్పంచ్‌ మారం ఇంద్రసేనారెడ్డి(పదవి నుంచి సస్పెండ్‌ చేశారు), డూప్లికేట్‌ డాక్యుమెంట్లు సమర్పించి బిల్లులు తీసుకున్న కోట నాగార్జునరెడ్డిలపై తాళ్లూరు పోలీ్‌సస్టేషన్‌లో సోమవారం చీటింగ్‌, అధికార దుర్వినియోగం కేసు నమోదైంది. ప్రభు త్వం విడుదల చేసిన నిధులను పనులు చేసిన వారికి కాకుండా ఇతరులకు చెల్లించి మోసానికి పాల్పడ్డారని ఎంపీడీవో కె.వై.కీర్తి ఫిర్యాదు మేరకు ఎస్సై బి.ప్రేమ్‌కుమార్‌ కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు... విఠలాపురం గ్రామానికి చెందిన మానం రమే్‌షబాబు, రమణాలవారిపాలేనికి చెందిన షేక్‌ కాలేషావలిలు చేపట్టిన నాలుగు పనులకు స్పష్టమైన రికార్డులు ఉన్నప్పటికీ ప్రభుత్వం గ్రామ పంచాయతీకి విడుదల చేసిన రూ.54,68,835 నిధులను సర్పంచ్‌ పక్కదారి పట్టించి స్వాహా చేశాడు. తాళ్లూరు గ్రామానికి చెందిన కోట నాగార్జునరెడ్డి ఆ ప నులను తాను చేసినట్లు దొంగ పత్రాలు సృష్టించి ఇంద్రసేనారెడ్డికి అం దజేశాడు. ఆ మేరకు బిల్లులు చెల్లించాడు. ఆ బిల్లుతో పాటు షేక్‌ కాలేషావలి చేపట్టిన పని తాలూకు విడుదలైన మెటీరియల్‌ బిల్లును కూడా చెల్లించకుండా సర్పంచ్‌ తానే స్వతాహాగా చెక్కు ద్వారా రూ.11,97, 554లను డ్రా చేశాడు. ఇంద్రసేనారెడ్డి సర్పంచ్‌ పదవికి ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేసి రమే్‌షకు చెందిన రూ54,68,835, కాలేషాకు చెందిన రూ11,97,554లను డ్రాచేసి ఇతరులకు ఇవ్వటం, తన స్వంతానికి వాడుకోవటంపై పంచాయతీ రాజ్‌అధికారులు జిల్లా కలెక్టర్‌కు నివేదిక ఇచ్చారు. కలెక్టర్‌ ఆదేశానుసారం ఎంపీడీవో కేవైకీర్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్‌ఐ కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2023-02-06T23:13:26+05:30 IST