కిలో రూ.231
ABN , First Publish Date - 2023-09-25T23:26:32+05:30 IST
కర్ణాటకలో ప్రస్తుత సీజన్ పొగాకు కొనుగోళ్లు సోమవారం ప్రారంభమయ్యాయి. అక్కడ ఉన్న పది కేంద్రాల్లో ఒకేసారి వేలంను చేపట్టారు. పొగాకు బోర్డు సెక్రటరీ దివి వేణుగోపాల్ పెరియపట్నం-3 వేలం కేంద్రంలో కొనుగోళ్లను ప్రారంభించగా మైసూరు పార్లమెంట్ సభ్యుడు ప్రతా్‌పసింగ్ తదితరులు పాల్గొన్నారు.

కర్ణాటకలో పొగాకు కొనుగోళ్లు ప్రారంభం
ఒంగోలు, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో ప్రస్తుత సీజన్ పొగాకు కొనుగోళ్లు సోమవారం ప్రారంభమయ్యాయి. అక్కడ ఉన్న పది కేంద్రాల్లో ఒకేసారి వేలంను చేపట్టారు. పొగాకు బోర్డు సెక్రటరీ దివి వేణుగోపాల్ పెరియపట్నం-3 వేలం కేంద్రంలో కొనుగోళ్లను ప్రారంభించగా మైసూరు పార్లమెంట్ సభ్యుడు ప్రతా్‌పసింగ్ తదితరులు పాల్గొన్నారు. తొలిరోజున ఒక్కొక్క వేలం కేంద్రంలో 27 బేళ్లు వేలంకు తెచ్చారు. మొత్తం బేళ్లను వ్యాపారులు కొనుగోలు చేయగా గరిష్ఠ ధర కిలో రూ.231 లభించింది. గతేడాది ప్రారంభం రోజున కిలో రూ.200 కాగా ఈసారి కిలోకు రూ.31 అదనంగా లభించింది. బోర్డు చరిత్రలో వేలం ప్రారంభం రోజున ఈ స్థాయి ధర పలకడం ఇదే ప్రథమం. కర్ణాటకలో ఈ ఏడాదికి 100 మిలియన్ కిలోలు పంట ఉత్పత్తికి అనుమతి ఇవ్వగా 80 మిలియన్లు ఉత్పత్తి అయినట్లు అంచనా. అలా ఉత్పత్తి తగ్గడంతోపాటు పంట నాణ్యత బాగా ఉండటంతో తొలిరోజునే మంచి ధరలు లభించినట్లు తెలుస్తోంది. అక్కడి రైతులు ప్రారంభ ధర కిలో రూ.250 ఉండాలని కోరినా రూ.231 లభించడం పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని అధికారవర్గాల సమాచారం ప్రధాన కంపెనీల వారంతా తొలిరోజు వేలంలో పాల్గొన్నట్లు చెప్తున్నారు.