గెలుపోటములను సమానంగా స్వీకరించాలి

ABN , First Publish Date - 2023-02-21T00:09:43+05:30 IST

క్రీడల్లో గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్‌ అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఒంగోలు శర్మాకళాశాల క్రీడామైదానంలో ఏర్పాటు చేసిన టీ20 క్రికెట్‌ పోటీలను ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశ హయాంలో క్రీడలకు పెద్దపీట వేశామన్నారు. రూ. 3 కోట్లతో మినీస్టేడియంను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. యుతను ప్రోత్సహించేందుకు ఇలాంటి క్రీడా పోటీలు ఉపయోగపడతాయన్నారు.

గెలుపోటములను సమానంగా స్వీకరించాలి
పోటీలను ప్రారంభిస్తున్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జనార్దన్‌

ఒంగోలు (కార్పొరేషన్‌), ఫిబ్రవరి 20 : క్రీడల్లో గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్‌ అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఒంగోలు శర్మాకళాశాల క్రీడామైదానంలో ఏర్పాటు చేసిన టీ20 క్రికెట్‌ పోటీలను ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశ హయాంలో క్రీడలకు పెద్దపీట వేశామన్నారు. రూ. 3 కోట్లతో మినీస్టేడియంను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. యుతను ప్రోత్సహించేందుకు ఇలాంటి క్రీడా పోటీలు ఉపయోగపడతాయన్నారు. పవన్‌ కళ్యాణ్‌, తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఫెండ్స్‌ ఆధ్వర్యంలో ఈ మ్యాచ్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా బ్యాటింగ్‌ చేసి పోటీలను ప్రారంభించారు. నిర్వాహకులు మదన్‌, రాములు మాట్లాడుతూ 26వ తేదీ వరకు జరిగే మ్యాచ్‌లలో తమిళనాడు నుంచి నాలుగు జట్లు, కర్ణాటక నుంచి రెండు జట్లు, ఏపీ నుంచి పలు జిల్లాల జట్లు పాల్గొననున్నాయి. కాగా మొదటి రోజు బాపట్ల, ఒంగోలు పోలీసు జట్లు పోటీల్లో పాల్గొన్నాయి.

Updated Date - 2023-02-21T00:09:45+05:30 IST