AP News: ఏపీ ప్రభుత్వానికి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు

ABN , First Publish Date - 2023-06-02T19:47:20+05:30 IST

ఏపీ ప్రభుత్వానికి (AP Govt) జాతీయ మానవహక్కుల సంఘం (NHRC) నోటీసులిచ్చింది. అల్లూరి జిల్లా జాజులబండలో పాఠశాల లేకపోవడంపై సుమోటోగా స్వీకరించి నోటీసులిచ్చింది.

AP News: ఏపీ ప్రభుత్వానికి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు

ఢిల్లీ: ఏపీ ప్రభుత్వానికి (AP Govt) జాతీయ మానవహక్కుల సంఘం (NHRC) నోటీసులిచ్చింది. అల్లూరి జిల్లా జాజులబండలో పాఠశాల లేకపోవడంపై సుమోటోగా స్వీకరించి నోటీసులిచ్చింది. గ్రామంలో 60 మంది విద్యార్ధులున్నా పాఠశాల లేదంటూ పత్రికల్లో వార్తలు వచ్చాయి. 6 కిలోమీటర్ల దూరం నడిచి స్కూలుకు వెళ్లలేకపోతున్నామని గిరిజన విద్యార్థులు వాపోతున్నారు. విద్యార్థుల కోసం తాత్కాలికంగా ఓ ఎన్జీవో సంస్థ స్కూల్ ఏర్పాటు చేసింది. ఎన్జీవో స్కూల్ ఏర్పాటు చేసినా టీచర్ను ఎందుకు కేటాయించలేదని జగన్ ప్రభుత్వాన్ని ఎన్‌హెచ్‌ఆర్‌సీ ప్రశ్నించింది. గ్రామంలో పాఠశాల ఏర్పాటుకు చేపట్టిన చర్యలు తెలపాలంటూ జాతీయ మానవహక్కుల సంఘం, ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Updated Date - 2023-06-02T19:47:20+05:30 IST