వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి : టీడీపీ

ABN , First Publish Date - 2023-04-03T21:39:29+05:30 IST

అరాచకపాలన చేస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని టీడీపీ పట్టణ అధ్యక్షుడు బొద్దులూరు మల్లికార్జున్‌నాయుడు, నాయకులు బక్కయ్యనాయుడు, బో

 వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి : టీడీపీ
3పీడీకేఆర్‌ 3 : ఇదేం ఖర్మ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు

పొదలకూరు, ఏప్రిల్‌ 3: అరాచకపాలన చేస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని టీడీపీ పట్టణ అధ్యక్షుడు బొద్దులూరు మల్లికార్జున్‌నాయుడు, నాయకులు బక్కయ్యనాయుడు, బోగోలు భాస్కర్‌రెడ్డి, జమీర్‌లు అన్నారు. సోమవారం పట్టణంలోని శ్రీహరికాలనీ, అయ్యప్పనగర్‌, చిట్టేపల్లి ప్రాంతాల్లో ఇదేంఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మల్లికార్జున్‌నాయుడు మాట్లాడుతూ నాలుగేళ్లలో అభివృద్ధి లేకపోగా ఉన్న ఆస్తుల విధ్వంసమే పనిగా వైసీపీ నేతలు పెట్టుకున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు పట్టం కడితే అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వెంపులూరు అరుణ, కొమ్మి చిరంజీవి, పెంచలయ్య, గంగవరపు ఈశ్వర్‌, కొంగి మస్తానమ్మ, వెంకటరమణయ్య, శీనయ్య తదితరులు పాల్గొన్నారు.

వైసీపీ పాలనలో కుంటుపడిన అభివృద్ధి

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి కుంటుపడిందని టీడీపీ నాయకులు, యూనిట్‌ ఇన్‌చార్జి అక్కెం సుధాకర్‌రెడ్డి, మాలపాటి భాస్కర్‌రెడ్డిలు ఆరోపించారు. సోమవారం మండలంలోని ముదిగేడులో ఇదేంఖర్మ రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే మళ్లీ బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అక్కెం శ్రీనివాసులురెడ్డి, అక్కెం గోపాల్‌రెడ్డి, అంకిరెడ్డి, సంగాపు రమణయ్య, సూరిపాక చిన్న వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-03T21:39:29+05:30 IST