వైసీపీ పాలనకు ప్రజల చరమగీతం
ABN , First Publish Date - 2023-06-11T23:37:47+05:30 IST
వైసీపీ ప్రభుత్వ పాలనలో టీడీపీ నాయకుల అక్రమ అరెస్ట్‌లు, గ్రావెల్, ఇసుక, మట్టి, గంజాయి, క్రికెట్ బెట్టింగ్‌ల మాఫియా రాష్ట్రంలో రాజ్యమేలుతున్నాయని, త్వరలో ప్రజలే ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని టీడీపీ రాష్ట్ర మాజీ ఆర్గనైజింగ్ సెక్రటరీ జీవీఎన్ శేఖర్‌రెడ్డి ధ్వజమెత్తారు.
కొడవలూరు, జూన్ 11 : వైసీపీ ప్రభుత్వ పాలనలో టీడీపీ నాయకుల అక్రమ అరెస్ట్‌లు, గ్రావెల్, ఇసుక, మట్టి, గంజాయి, క్రికెట్ బెట్టింగ్‌ల మాఫియా రాష్ట్రంలో రాజ్యమేలుతున్నాయని, త్వరలో ప్రజలే ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని టీడీపీ రాష్ట్ర మాజీ ఆర్గనైజింగ్ సెక్రటరీ జీవీఎన్ శేఖర్‌రెడ్డి ధ్వజమెత్తారు. మండలంలో నార్తురాజుపాళెం పీఎస్‌ఆర్ కల్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేడు రాష్ట్రంలో పెరిగిన నిత్యావసర ధరలు, గ్యాస్, పెట్రోలు, విద్యుత్ చార్జీలతో సామాన్య ప్రజలతో పాటు వ్యాపారులు సంతోషంగా లేరని పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు. రాష్ర్టానికి పరిశ్రమలు రాక నిరుద్యోగ సమస్య పెరిగి యువత రోడ్డున పడుతున్నారని అన్నారు. నియోజకవర్గంలో వ్యక్తిగత దూషణ చేస్తూ విష సంస్కృతిని ప్రోత్సహిస్తుండడం తగదన్నారు. నేడు ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా యువగళంలో పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ బాబుకు ప్రజలు నీరాజనాలు పడుతున్నారని అన్నారు. అనంతరం టీడీపీ జీల్లా అధికార ప్రతినిధి చెముకుల కృష్ణ చైతన్య , టీడీపీ మండల అధ్యక్షుడు కోటంరెడ్డి అమరేంద్రరెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు చెక్కా మదన్, కేతూ వెంకట రమణారెడ్డి, డేగా దయాకర్ రెడ్డి, నాసిన ప్రసాద్, వీనీల్‌రెడ్డి, మాగుంట సతీష్‌రెడ్డి, బద్వేల్ ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
========