లోకేష్‌ పాదయాత్రతో వైసీపీకి అంతిమయాత్ర

ABN , First Publish Date - 2023-01-24T23:19:17+05:30 IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పాదయాత్రతో వైసీపీ ప్రభుత్వానికి అంతిమయాత్ర తప్పదని టీడీపీ కోవూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పోలంరెడ్డి దినేష్‌రెడ్డి అన్నారు.

లోకేష్‌ పాదయాత్రతో వైసీపీకి అంతిమయాత్ర
మాట్లాడుతున్న టీడీపీ నేత పోలంరెడ్డి దినేష్‌రెడ్డి

ఇందుకూరుపేట, జనవరి 24 : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పాదయాత్రతో వైసీపీ ప్రభుత్వానికి అంతిమయాత్ర తప్పదని టీడీపీ కోవూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పోలంరెడ్డి దినేష్‌రెడ్డి అన్నారు. మంగళవారం లేబూరు గ్రామంలో ఇదేమీ ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనకు గ్రామస్థులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి పదవికి అంతిమ గడియలు దగ్గర పడ్డాయని తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మళ్లీ గాడిలో పడాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా నారా లోకేష్‌ పాదయాత్రను అడ్డుకోలేరన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు రావెళ్ల వీరేంద్రచౌదరి, నాయకులు చెంచుకిషోర్‌యాదవ్‌, చెముకుల కృష్ణచైతన్య, కొండూరు సుధాకర్‌రెడ్డి, దొడ్ల నరేందర్‌రెడ్డి, ఎంపీటీసీ మధుసూదన్‌రెడ్డి, ఉదయగిరి పెంచలయ్య, గంపల అనిల్‌కుమార్‌, ఈదూరు చెన్నయ్య, మునగాల రంగారావు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-24T23:19:17+05:30 IST