చికిత్స పొందుతూ అనాథ వృద్ధుడి మృతి

ABN , First Publish Date - 2023-05-26T23:29:20+05:30 IST

: కన్నబిడ్డలు వదిలేసిన ఓ గుర్తు తెలియని వృద్ధుడు స్థానిక ఆర్‌అండ్‌బీ బంగ్లాలో నాలుగు రోజులుగా ప్రాణాపాయ స్థితితో కొట్టుమిట్టాడుతున్నాడు. గమనించిన స్థానికులు శుక్రవారం చొరవ తీసుకొని పోలీసులకు, వైద్యసిబ్బందికి సమాచారం అందించారు. ఈలోపు స్థానికులు వృద్ధుడికి ఆహారం అందించబోగా తీసుకోలేని స్థితిలో ఉ

 చికిత్స పొందుతూ అనాథ వృద్ధుడి మృతి
26కేఎల్‌జీ1: వైద్యశాలకు వృద్ధుడిని తరలిస్తున్న పోలీసులు

కలిగిరి, మే26: కన్నబిడ్డలు వదిలేసిన ఓ గుర్తు తెలియని వృద్ధుడు స్థానిక ఆర్‌అండ్‌బీ బంగ్లాలో నాలుగు రోజులుగా ప్రాణాపాయ స్థితితో కొట్టుమిట్టాడుతున్నాడు. గమనించిన స్థానికులు శుక్రవారం చొరవ తీసుకొని పోలీసులకు, వైద్యసిబ్బందికి సమాచారం అందించారు. ఈలోపు స్థానికులు వృద్ధుడికి ఆహారం అందించబోగా తీసుకోలేని స్థితిలో ఉన్నాడు. దీంతో స్థానికులు, పోలీసులు స్పందించి స్థానిక పీహెచ్‌సీకి తరలించి వైద్యసేవలు అందించారు. మాట్లాడలేని నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధుడు మూగసైగల ద్వారా తన బాధను తెలియజేశాడు. అతను ఏ ప్రాంతానికి చెందినవాడో తెలియడంలేదు. కాగా ఆ వృద్ధుడు వైద్యశాలలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి 10 గంటలకు మృతి చెందాడని వైద్యాధికారి డాక్టర్‌ గీతారెడ్డి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆత్మకూరుకు తరలించామన్నారు.

Updated Date - 2023-05-26T23:29:20+05:30 IST