వారం రోజుల్లోనే ఎలక్ట్రికల్‌ బస్సుల ప్రారంభం

ABN , First Publish Date - 2023-05-26T23:35:39+05:30 IST

నెల్లూరు-తిరుపతి మధ్య ఎలక్ట్రికల్‌ బస్సులను వారం రోజుల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆర్టీసీ నెల్లూరు-2 డిపో మేనేజర్‌ శివకేశవ యాదవ్‌, ఒలెట్రా కంపెనీ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ వెంకటేశ్వర్లు తెలిపారు.

వారం రోజుల్లోనే ఎలక్ట్రికల్‌ బస్సుల ప్రారంభం
డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్న అధికారులు

నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట), మే 26 : నెల్లూరు-తిరుపతి మధ్య ఎలక్ట్రికల్‌ బస్సులను వారం రోజుల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆర్టీసీ నెల్లూరు-2 డిపో మేనేజర్‌ శివకేశవ యాదవ్‌, ఒలెట్రా కంపెనీ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ వెంకటేశ్వర్లు తెలిపారు. నగరంలోని ఆర్టీసీ రెండవ డిపో గ్యారేజ్‌లో శుక్రవారం ఎలక్ట్రికల్‌ బస్సు డ్రైవర్లతో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. నెల్లూరు-తిరుపతి మధ్య 12 ఎలక్ట్రికల్‌ బస్సులు తిరగనున్నాయని, 30 మంది డ్రైవర్లను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఒలెట్రా కంపెనీ మేనేజర్‌ సుబ్బారెడ్డి, ఆర్టీసీ రెండవ డిపో సెక్యూరిటీ ఇన్‌చార్జ్‌ సబ్రూద్దీన్‌, సూపర్‌వైజర్‌ గౌస్‌బాషా పాల్గొన్నారు.

===============

Updated Date - 2023-05-26T23:35:39+05:30 IST