వచ్చే నెలలో పులికాట్ ముఖద్వారం
ABN , First Publish Date - 2023-11-21T23:56:02+05:30 IST
దశాబ్దాల కల అయిన పులికాట్ ముఖద్వారం పూడికతీత పనులు వచ్చే నెలలో సీఎం జగన్ ప్రారంభిస్తారని తిరుపతి ఎంపీ గురుమూర్తి తెలిపారు.

తిరుపతి ఎంపీ గురుమూర్తి
నెల్లూరు (వ్యవసాయం), నవంబరు 21 : దశాబ్దాల కల అయిన పులికాట్ ముఖద్వారం పూడికతీత పనులు వచ్చే నెలలో సీఎం జగన్ ప్రారంభిస్తారని తిరుపతి ఎంపీ గురుమూర్తి తెలిపారు. ఓఎన్‌జీసీ పైపులైను తవ్వకాలతో జీవనోధి కోల్పోయిన అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాలకు చెందిన మత్స్యకారులకు నష్టపరిహారాన్ని తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి బటన్ నొక్కి వారి బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేశారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు కలెక్టరేట్ నుంచి పర్చువల్‌గా ఎంపీతోపాటు సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, కలెక్టర్ హరినారాయణన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పులికాట్ పూడికతీత పనులు మంగళవారం ముఖ్యమంత్రి ప్రారంభించాల్సి ఉండగా వర్షం కారణంగా రద్దయిందని చెప్పారు. పూడికతీతతో మత్స్య సంపద పెరిగి మత్స్యకారులకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఎమ్మెల్యే సంజీవయ్య మాట్లాడుతూ వచ్చే నెలలో పూడికతీత పనులతోపాటు కాళంగి నదిపై వంతెన పనులకు శ్రీకారం చుడుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్‌బాబు, ఎన్డీఈసీసీ బ్యాంకు చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, మత్స్యశాఖ జేడీ నాగేశ్వరరావు, ఏడీలు రంగనాథ్‌బాబు, శ్రీనివాసులు, మెరైన్ జేడీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.