డిగ్రీ పరీక్షల్లో 12 మంది డిబార్‌

ABN , First Publish Date - 2023-01-24T23:29:02+05:30 IST

విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిధిలోని అనుబంధ డిగ్రీ కళాశాలల్లో మంగళవారం జరిగిన డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షల్లో 12 మంది విద్యార్థులు డిబార్‌ అయినట్లు వీఎస్‌యూ పరీక్షల నిర్వాహణాధికారి డాక్టర్‌ ఆర్‌ ప్రభాకర్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

డిగ్రీ పరీక్షల్లో 12 మంది డిబార్‌

వెంకటాచలం, జనవరి 24 : విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిధిలోని అనుబంధ డిగ్రీ కళాశాలల్లో మంగళవారం జరిగిన డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షల్లో 12 మంది విద్యార్థులు డిబార్‌ అయినట్లు వీఎస్‌యూ పరీక్షల నిర్వాహణాధికారి డాక్టర్‌ ఆర్‌ ప్రభాకర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం జరిగిన ఐదో సెమిస్టర్‌ పరీక్షల్లో 1228 మంది విద్యార్థులకు గాను 1100 మంది హాజరు కాగా మిగిలిన 128 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. మధ్యాహ్నం జరిగిన మూడో సెమిస్టర్‌ పరీక్షల్లో 10483 మంది విద్యార్థులకు గాను 9659 మంది హాజరు కాగా మిగిలిన 824 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. ఉదయం సూళ్లూరుపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నలుగురు, శ్రీ ప్రతిభ డిగ్రీ కళాశాలలో ఒకరు, నెల్లూరులోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో ఒకరు, వింజమూరులోని నేతాజీ డిగ్రీ కళాశాలలో ఒకరు, మధ్యాహ్నం నాయుడుపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒకరు, విద్యానగర్‌లోని ఎన్‌బీకేఆర్‌ కళాశాలలో ఒకరు, సూళ్లూరుపేటలోని శ్రీ ప్రతిభ డిగ్రీ కళాశాలలో ఒకరు, వెంకటగిరిలోని వైష్ణవి కళాశాలలో ఇద్దరు చొప్పున మొత్తం 12 మంది విద్యార్థులు డిబార్‌ అయినట్లు తెలిపారు.

Updated Date - 2023-01-24T23:29:02+05:30 IST