జగన్‌ పాలనలో దగా పడుతున్న దళితులు : బొల్లినేని

ABN , First Publish Date - 2023-06-25T22:27:06+05:30 IST

జగన్‌ పాలనలో దళితులు అడుగడుగున దగా పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు పేర్కొన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆదివారం నియోజకవర్గ స్థాయి ఎస్సీ సెల్‌ సమావేశం నిర్వహించారు.

జగన్‌ పాలనలో దగా పడుతున్న దళితులు : బొల్లినేని
25 కెఎల్‌ జి 01: మాట్లాడుతున్న బొల్లినేని

కలిగిరి, జూన్‌ 25: జగన్‌ పాలనలో దళితులు అడుగడుగున దగా పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు పేర్కొన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆదివారం నియోజకవర్గ స్థాయి ఎస్సీ సెల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బొల్లినేని మాట్లాడుతూ వైసీపీ అధికారం చేపట్టాక దళితులపై దాడులు పెరిగాయన్నారు. ఎస్సీ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చెయ్యడంతో పాటు దళితులకు అందాల్సిన 27 సంక్షేమ పథకాలను పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు. టీడీపీ హయాంలో వేలాది మంది ఎస్సీ యువతకు ఉపాధి లభించగా వైసీపీ పాలనలో నిరుద్యోగుల సంఖ్య విపరీతంగా పెరిగిందన్నారు. రానున్న ఎన్నికల్లో దళితులు ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసెల్‌ పార్లమెంట్‌ అధ్యక్షుడు కాకి ప్రసాద్‌, నియోజకవర్గ అధ్యక్షుడు స్వర్ణా కొండయ్య, కార్యనిర్వాహక కార్యదర్శి బొగ్గవరపు వేణు, నాయకులు చీదర్ల మల్లికాన్జున, కలివెల జ్యోతి, నూనె ప్రసాద్‌, జాషువా, బద్దిపూడి మాచర్ల తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-25T22:27:06+05:30 IST