సొంత నిధులతో తరగతి గది నిర్మాణం

ABN , First Publish Date - 2023-09-25T22:48:31+05:30 IST

స్థానిక ప్రభుత్వ డిగ్రీకళాశాలలో వృక్షశాస్త్ర విభాగానికి తరగతి గదిని ఆ శాఖోపన్యాసకులు మోపర్తి జాన్‌పాల్‌ నిర్మించారు

  సొంత నిధులతో తరగతి గది నిర్మాణం
25కేవీఆర్‌1: తరగతి గదిని ప్రారంభిస్తున్న ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ లక్ష్మీప్రసూన

కోవూరు, సెప్టెంబరు25: స్థానిక ప్రభుత్వ డిగ్రీకళాశాలలో వృక్షశాస్త్ర విభాగానికి తరగతి గదిని ఆ శాఖోపన్యాసకులు మోపర్తి జాన్‌పాల్‌ నిర్మించారు. ఈ గదిని సోమవారం ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సీపీ లక్ష్మీప్రసూన ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ లెక్చరర్‌ జాన్‌పాల్‌ సొంత నిధులతో గదిని నిర్మించడం అభినందనీయ మన్నారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ రామప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-25T22:48:31+05:30 IST