పఠనాశక్తిని పెంపొందించాలి

ABN , First Publish Date - 2023-03-17T23:39:38+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థుల్లో పఠనాశక్తిని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని ఎంఈవో షేక్‌ మస్తాన్‌వలి సూచించారు.

పఠనాశక్తిని పెంపొందించాలి
విద్యార్థి ప్రగతిని పరిశీలిస్తున్న ఎంఈవో

ఉదయగిరి రూరల్‌, మార్చి 17: ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థుల్లో పఠనాశక్తిని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని ఎంఈవో షేక్‌ మస్తాన్‌వలి సూచించారు. శుక్రవారం పట్టణంలోని బీసీ కాలనీ ప్రాథమిక పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల నైపుణ్య సామర్థ్యాలను పరీక్షించారు. పాఠశాలలో జరుగుతున్న నాడు-నేడు పనులను పరిశీలించి, పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని రుచి చూసి మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎం నాగయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-17T23:39:38+05:30 IST