విద్యార్థులకు పరీక్ష సామగ్రి పంపిణీ
ABN , First Publish Date - 2023-03-18T23:01:47+05:30 IST
దుత్తలూరు ఆదర్శ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు మేకపాటి పెదమాలకొండయ్య చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో శనివారం స్కూల్ కో-ఆప్షన్ సభ్యుడు మేకపాటి మాల్యాద్రినాయుడు పరీక్ష సామగ్రి పంపిణీ చేశారు.

ఉదయగిరి రూరల్, మార్చి 18: దుత్తలూరు ఆదర్శ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు మేకపాటి పెదమాలకొండయ్య చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో శనివారం స్కూల్ కో-ఆప్షన్ సభ్యుడు మేకపాటి మాల్యాద్రినాయుడు పరీక్ష సామగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో పదో తరగతి చదువుతున్న 73 మంది విద్యార్థులకు ప్యాడ్‌లు, పెన్నులు, జామిట్రీ బాక్సులు అందజేశారు. అనంతరం నిర్వహించిన సరస్వతీదేవి పూజలో విద్యార్థులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సైమన్‌రావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఉదయగిరి: మండలంలోని గడ్డంవారిపల్లి ఉన్నత పాఠశాలలో శనివారం విద్యార్థులు సరస్వతి పూజ నిర్వహించారు. పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను ఉపాధ్యాయులు దీవించారు. అనంతరం గతేడాది పదో తరగతి పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు పీవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పీ వెంకట్రాయుడు రూ.10వేలు, రూ.5వేలు, రూ.3వేలు చొప్పున నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో హెచ్‌ఎం శీనయ్య, ఉపాధ్యాయులు కరీముల్లా, సర్ధార్, ప్రకాష్‌రావు తదితరులు పాల్గొన్నారు.
==========