నిలిచిన బ్యాంకు సేవలు

ABN , First Publish Date - 2023-01-19T23:21:49+05:30 IST

మండలంలోని పెద్దిరెడ్డిపల్లి యూనియన్‌ బ్యాంకులో మూడు రోజులుగా సేవలు నిలిచిపోయాయి.

నిలిచిన బ్యాంకు సేవలు
పెద్దిరెడ్డిపల్లి యూనియన్‌ బ్యాంకు

19వీకేపీ3:

వరికుంటపాడు, జనవరి 19: మండలంలోని పెద్దిరెడ్డిపల్లి యూనియన్‌ బ్యాంకులో మూడు రోజులుగా సేవలు నిలిచిపోయాయి. నెట్‌ సరఫరాలో ఏర్పడిన అంతరాయం కారణంగా రోజుల తరబడి ఖాతాదారులు విసుగెత్తిపోతున్నారు. విషయం తెలియక పలు గ్రామాల నుంచి వివిధ రకాల పనులపై బ్యాంకుకు పరుగులు తీసిన ఖాతాదారులు గంటల తరబడి అక్కడే ఎదురు చూసినా ఫలితం లేకపోవడంతో నిరాశగా వెనుదిరగాల్సి వస్తోంది. ఖాతాదారులు తీవ్ర స్ధాయిలో మండిపడుతున్నారు. బ్యాంకు అధికారులు నెట్‌ వర్క్‌ లేదు, సహకరించవలెను అంటూ బోర్డును ఏర్పాటు చేయడం గమనార్హం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మూరుమూల ప్రాంతంలోని బ్యాంకు సేవలకు ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరం కొనసాగేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Updated Date - 2023-01-19T23:21:51+05:30 IST