ఎమ్మెల్సీగా శ్రీకాంత్‌ విజయంపై సంబరాలు

ABN , First Publish Date - 2023-03-18T22:26:21+05:30 IST

ఎమ్మెల్సీగా కంచర్ల శ్రీకాంత్‌ విజయంపై శనివారం కావలిలో టీడీపీ ఇన్‌చార్జి మాలేపాటి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. పార్టీ కార్యాల

ఎమ్మెల్సీగా శ్రీకాంత్‌ విజయంపై సంబరాలు
18కెవిఎల్‌1: కావలి : మహిళలతో విజయోత్సవ కేక్‌ కట్‌చేస్తున్న మాలేపాటి

కావలి,మార్చి18: ఎమ్మెల్సీగా కంచర్ల శ్రీకాంత్‌ విజయంపై శనివారం కావలిలో టీడీపీ ఇన్‌చార్జి మాలేపాటి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. పార్టీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా బాణసంచా కాల్చుకుంటూ ట్రంకురోడ్డులోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్దకు చేరుకున్నారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అక్కడ విజయోత్సవాన్ని జరుపుకున్నారు. అనంతరం కార్యాలయంలో కేక్‌ కట్‌ చేసి పంచి పెట్టారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు మన్నవ రవిచంద్ర, పోతుగంటి అలేఖ్య, గుత్తికొండ కిషోర్‌, మొగిలి కల్లయ్య, జ్యోతిబాబూరావు, బాలగురుస్వామి, ఆవుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

లింగసముద్రం : కంచర్ల శ్రీకాంత్‌ విజయం సాధించడంపై మండలంలోని పెదపవని టీడీపీ నేతలు శనివారం సంబరాలు జరుపుకున్నారు. నియోజకవర్గ ముస్లిం మైనారిటీ అధ్యక్షుడు సయ్యద్‌ నాయబ్‌ రసూల్‌ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

అనంతసాగరం : ఎమ్మెల్సీ ఎన్నికల్లో కంచర్ల శ్రీకాంత్‌ విజయంపై మండలంలోని కొత్తపల్లిలో శనివారం మండల తెలుగు యవత అధ్యక్షుడు చల్లా నరసారెడ్డి మిఠాయిలు పంచిపెట్టారు.

కొండాపురం: ఎమ్మెల్సీగా శ్రీకాంత్‌ విజయంపై మండలపార్టీ కన్వీనర్‌ మామిళ్లపల్లి ఓంకార్‌ ఆద్వర్యంలో పార్టీ నాయకులు శనివారం హర్షం ప్రకటించారు. స్థానిక బస్టాండు కూడలిలో బాణసంచా కాల్చి ర్యాలీ నిర్వహించారు. కాగా ఎమ్మెల్సీ కౌంటింగ్‌ కేంద్రం వద్దకు వెళ్లిన మండల టీడీపీ నాయకులు చెరుకూరు వెంకటాద్రి, చాగంటి క్రిష్ణ, సీహెచ్‌.బాలయ్యలు డిక్లరేషన్‌ తీసుకొని బయటకు వచ్చిన కంచర్ల శ్రీకాంత్‌ను కలసి అభినందనలు తెలిపారు.

జలదంకి : పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను టీడీపీ క్లీన్‌స్వీప్‌ చేయడంతో ఆ పార్టీ శ్రేణులు శనివారం సాయంత్రం జలదంకి బస్టాండు కూడలిలో కేక్‌కట్‌ చేసి, బాణసంచా పేల్చుతూ సంబరాలు చేసుకున్నారు. ఈ సంబరాల్లో మండల టీడీపీ అధ్యక్షుడు పీ మధుమోహన్‌రెడ్డి సీనియర్‌ నాయకులు వంటేరు జయచంద్రారెడ్డి, పూనూరు భాస్కర్‌రెడ్డి, మందపల్లి మాల్యాద్రియాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-18T22:26:21+05:30 IST