ప్రమాదభరితంగా ‘సోమశిల’ పరిసరాలు!

ABN , First Publish Date - 2023-04-04T21:36:57+05:30 IST

సోమశిల ప్రాజెక్టు పరిసరాలు ప్రమదభరితంగా మారాయి. దీంతో పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు.

ప్రమాదభరితంగా ‘సోమశిల’ పరిసరాలు!
జలాశయం ముందు ప్రమాదభరింతగా ఇనుప చువ్వలు

సోమశిల ప్రాజెక్టు పరిసరాలు ప్రమదభరితంగా మారాయి. దీంతో పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. ఆఫ్రాన్‌ ప్రాంతంలో అభివృద్ధి పనులు మూడు నెలలుగా ఆగిపోయాయి. ఇక్కడ కాంక్రీట్‌లో ఇనుప చువ్వలను నిర్లక్ష్యంగా వదిలేశారు. ఈ క్రమంలో సోమశిల సందర్శకులు జలాశయం ముందు కట్టడాలు వీక్షించలేని పరిస్ధితి నెలకొంది. హెచ్చరిక బోర్డులు లేక కొందరు ఆఫ్రాన్‌ ప్రాంతంలో సంచిరిస్తూ ఇనుప చువ్వలతో ప్రమాదాలుకు గురవుతున్నారు. ఆదే ప్రాంతంలో వాహన రాకపోకలు కొనసాగించే మార్గం గుంతలా మారింది. చిన్నపాటి వర్షం కురిసినా నీరు నిల్వచేరి రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. ఆప్రాంతంలో నీరు నిల్వ చేరకుండా, ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని వాహన చోదకులు కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి హెచ్చరిక బోర్డులతో పాటు ప్రమాదాలు జరగకుండా పనులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు.

- అనంత సాగరం

Updated Date - 2023-04-04T21:36:57+05:30 IST