సెంటు భూమి ఆక్రమించినా స్వాధీనం చేసుకోవచ్చు
ABN , Publish Date - Dec 18 , 2023 | 10:08 PM
మండల పరిధిలోని దంపూరులో తమ కార్యకర్తలు సెంటు భూమిని అక్రమించినా, అధికారులు స్వాధీనం చేసుకోవచ్చునని టీడీపీ నాయకులు చెముకుల కృష్ణచైతన్య, చేవూరు రాంప్రసాద్‌లు తెలిపారు. ఈ మేరకు సోమవారం
- టీడీపీ నాయకులు
విడవలూరు, డిసెంబరు 18: మండల పరిధిలోని దంపూరులో తమ కార్యకర్తలు సెంటు భూమిని అక్రమించినా, అధికారులు స్వాధీనం చేసుకోవచ్చునని టీడీపీ నాయకులు చెముకుల కృష్ణచైతన్య, చేవూరు రాంప్రసాద్‌లు తెలిపారు. ఈ మేరకు సోమవారం డీటీ భానుప్రకాష్‌ను కలసి వినతిపత్రం అందజేశారు. అనంతర వారు మాట్లాడుతూ మండలంలో టీడీపీ బలపడుతుందన్న అక్కసుతో నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం, అవినీతి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. దంపూరులో టీడీపీలో చేరిన వారు భూమిని అక్రమించుకుని ఉంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చునన్నారు. అలాకాని పక్షంలో వైసీపీ నాయకులు తలలను ఎక్కడ పెట్టుకుంటారో సమాధానం చెప్పాలన్నారు. ఎమ్మెల్యే ప్రసన్న వల్ల నష్టపోయిన నాయకులే టీడీపీలో చేరుతున్నారని తెలిపారు. ఇంకా అనేకమంది టీడీపీలోకి రావటానికి సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో నాయకులు మాతూరు శ్రీనివాసులురెడ్డి, చెముకుల శ్రీనివాసులు, ఇమాంబాషా, సత్యవోలు సత్యంరెడ్డి, డక్కా భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
--------