ఆనంకు భద్రత కుదింపు... అనిల్‌కు పెంపు!
ABN , First Publish Date - 2023-01-15T03:10:47+05:30 IST
వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిపై వైసీపీ అధిష్ఠానం కక్ష కట్టినట్లు కనిపిస్తోందనే ప్రచారానికి బలం చేకూర్చే సంఘటన మరొకటి చోటు చేసుకుంది.
వెంకటగిరి ఎమ్మెల్యేకు 1 ప్లస్ 1
నెల్లూరు నగర ఎమ్మెల్యేకు 2 ప్లస్ 2 సెక్యూరిటీ
నెల్లూరు, జనవరి 14(ఆంధ్రజ్యోతి): వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిపై వైసీపీ అధిష్ఠానం కక్ష కట్టినట్లు కనిపిస్తోందనే ప్రచారానికి బలం చేకూర్చే సంఘటన మరొకటి చోటు చేసుకుంది. ఆనం వ్యక్తిగత భద్రతను కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యేగా ఉన్న ఆనంకు వన్ ప్లస్ వన్ భద్రత కల్పించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వెంకటగిరి ఎమ్మెల్యే అయ్యాక సెక్యూరిటీని 2 ప్లస్ 2కు పెంచింది. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న ఆనం అధికారాలను కట్ చేస్తూ ఒకదాని తరువాత ఒక సంఘటన చోటు చేసుకొంటున్న తరుణంలో సెక్యూరిటీని కుదించడం మరో చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్‌కు సెక్యూరిటీని ఒన్ ప్లస్ ఒన్ నుంచి 2 ప్లస్ 2కు పెంచింది.