పాఠశాలలో నాగుపాము హల్‌చల్
ABN , First Publish Date - 2023-11-24T23:59:32+05:30 IST
బోగోలు మండలం విశ్వనాథరావుపేట పంచాయతీ కొత్తూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో శుక్రవారం నాగుపాము హల్‌చల్ చేసింది.
బిట్రగుంట, నవంబరు 24: బోగోలు మండలం విశ్వనాథరావుపేట పంచాయతీ కొత్తూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో శుక్రవారం నాగుపాము హల్‌చల్ చేసింది. స్థానికుల కథనం మేరకు.. ఉదయం 10 గంటల సమయంలో పాఠశాల ఎదురుగా ఉన్న సరస్వతి విగ్రహం వద్ద బుసలు కొడుతున్న శబ్ధం విన్న ప్రధానోపాధ్యాయిని శారద పాము ఉన్నట్లు గ్రహంచి స్థానికులకు తెలపడంతో వారు పాము కొట్టి చంపేశారు. పడగ విప్పి బుసలు కొట్టిన నాగు పామును చూపి విద్యార్థులు హడలిపోయారు. పాఠశాలకు ప్రహరీ లేకపోవడం వలన బయట నుంచి విషపురుగులు, పాములు, జంతువులు వస్తున్నాయని విద్యార్థులు వాపోయారు.