ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్‌ సీట్లు కేటాయించాలి

ABN , First Publish Date - 2023-09-21T21:43:58+05:30 IST

పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్‌ బిల్లులో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు సీట్లు కేటాయించాలని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్‌. మల్లి పేర్కొన్నారు. ఆర్డీవో కార్యాలయం వద్ద గురువారం దళిత సంఘాల

ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్‌ సీట్లు కేటాయించాలి
21కెవిఎల్‌6: ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న దళిత సంఘాల నేతలు

కావలి, సెప్టెంబరు21: పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్‌ బిల్లులో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు సీట్లు కేటాయించాలని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్‌. మల్లి పేర్కొన్నారు. ఆర్డీవో కార్యాలయం వద్ద గురువారం దళిత సంఘాల నేతలు ధర్నా చేసి ఆర్డీవో శీనానాయక్‌కు వినతిపత్రం అందచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రిజర్వేషన్‌ బిల్లుతో ధనవంతుల, రాజకీయ నాయకుల కుటుంబాల్లోని మహిళలకే మేలు కలుగుతుంది తప్ప ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు ఒరిగేదేమీ లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం బడుగువర్గాల వారి అభిప్రాయాలను గౌరవించి అట్టడుగు వర్గాలకు 33 శాతం రిజర్వేషన్‌లో భాగస్వామ్యం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో దళిత నేతలు మాల్యాద్రి, మహేంద్ర, రూప, మాధవరావు, సీనయ్య, జరుగుమల్లి విజయరత్నం, జలదంకి మాలి, లక్ష్మీనర్సు, దయాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-21T21:43:58+05:30 IST