ఘనంగా సావిత్రీబాయి ఫూలే జయంతి
ABN , First Publish Date - 2023-01-03T21:59:56+05:30 IST
భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయిని, సంఘసంస్కర్త సావిత్రీబాయి ఫూలే జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు.
కందుకూరు, జనవరి 3: భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయిని, సంఘసంస్కర్త సావిత్రీబాయి ఫూలే జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. మండలంలోని కోవూరు సచివాలయంలో ఎమ్మెల్యే మహీధరరెడ్డి సావిత్రీబాయి ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే పట్టణ టీడీపీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన సావిత్రీబాయి ఫూలే జయంతి కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎన్‌వీ సుబ్బారావు, రాయపాటి శ్రీనివాసరావు, మున్నా, షేక్ ఫిరోజ్, సవిడిబోయిన కృష్ణ, ముచ్చు వేణు, కల్లూరి శైలజ, మయూరి, హారిక తదితరులు పాల్గొన్నారు. టీఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఐక్యుఏసి కో ఆర్డినేటర్ పి.రాజగోపాలబాబు అధ్యక్షతన ఫూలే సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాల మహిళా అధ్యాపకులు షేక్ షానాజ్‌బేగం, కె. సుజాత, కెవి పద్మావతి, జె.మైత్రి, ఐ.అనూష, యం.జ్యోతి, ఇంద్రజ తదితరులు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీజేపీ కార్యాలయంలో సావిత్రీబాయి ఫూలేకి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు జొన్నాదుల రాఘవయ్య, జగన్నాథం వైకుంఠం, మన్నేపల్లి వరప్రసాదరావు, అమలనాథుని మాల్యాద్రి, మువ్వల భూషయ్య, గట్టమనేని హరిబాబు, కవర్తపు మల్లిఖార్జున, తానికొండ కోటయ్య, యం.శివకుమార్, మాటూరి రమే్‌షనాయుడు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.