60 శరత్తులు పుస్తకావిష్కరణ
ABN , First Publish Date - 2023-11-21T21:27:05+05:30 IST
మండలంలోని సరస్వతీ నగర్ వద్ద ఉన్న ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రంలో మంగళవారం 60 శరత్తులు (కవితా సంపుటి) పుస్తకాన్ని ఆవిష్కరించారు. అధ్యయన కేంద్రం సంచాలకులు మాడభూషి సంపత్‌కుమార్ రచించిన ఈ పుస్తకాన్ని జాతీయ పరీక్ష సేవా కేంద్రం (భారతీయ భాష సంస్థ, మైసూరు) ప్రతినిధి డాక్టర్

వెంకటాచలం, నవంబరు 21 : మండలంలోని సరస్వతీ నగర్ వద్ద ఉన్న ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రంలో మంగళవారం 60 శరత్తులు (కవితా సంపుటి) పుస్తకాన్ని ఆవిష్కరించారు. అధ్యయన కేంద్రం సంచాలకులు మాడభూషి సంపత్‌కుమార్ రచించిన ఈ పుస్తకాన్ని జాతీయ పరీక్ష సేవా కేంద్రం (భారతీయ భాష సంస్థ, మైసూరు) ప్రతినిధి డాక్టర్ ఎం నారాయణరెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ప్రముఖ కవి డాక్టర్ పెరుగు రామకృష్ణ మాట్లాడుతూ మాడభూషి నిబద్ధత కలిగిన కవి అని, తన అనుభవంలోకి వచ్చిన ప్రతి విషయాన్ని కవిత్వంగా మలిచే సామర్థ్యం కలిగిన ధీశాలి అని పేర్కొన్నారు. డాక్టర్ ఎం నారాయణరెడ్డి మాట్లాడుతూ 60 శరత్తులు పుస్తకంలో కవితా శీర్షికలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయని కొనియాడారు. కార్యక్రమంలో డాక్టర్ ఝూన్సీ వాణి, డాక్టర్ టేకుమళ్ల వెంకటప్పయ్య, అధ్యయన కేంద్రం సిబ్బంది, పరిశోధకులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
--------------------