శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభం

ABN , First Publish Date - 2023-03-25T23:50:19+05:30 IST

వింజమూరులోని సొసైటీ కార్యాలయంలో శనగల కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఏపీ మార్కెఫెడ్‌ జిల్లా మేనేజర్‌ ఎస్‌.పవన్‌కుమార్‌ ప్రారంభించారు.

 శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభం
కొనుగోలు కేంద్రంలో శనగలు పరిశీలిస్తున్న అధికారులు

వింజమూరు, మార్చి 25 : వింజమూరులోని సొసైటీ కార్యాలయంలో శనగల కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఏపీ మార్కెఫెడ్‌ జిల్లా మేనేజర్‌ ఎస్‌.పవన్‌కుమార్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సుమారు 16వేల హెక్టార్లలో శనగ సాగు చేశారని, అందులో 18వేల క్వింటాళ్లు దిగుబడి వచ్చినట్లు తెలిపారు. కాగా ఇందులో 25శాతం మాత్రమే కొనుగోలు చేయనున్నామన్నారు, మండల పరిధిలో 700 ఎకరాల్లో శనగపంట సాగు చేశారని, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.5,335గా ఉందని తెలిపారు. రైతులు ముందుగా గ్రామాల్లో వీఏఈఎల్‌ ద్వారా ఈక్రాప్‌ నమోదు చేసుకోవాలని, అదేవిధంగా సీఎంఎస్‌లో నమోదై ఉండాలని తెలిపారు. తర్వాత వాటిని పరిశీలించి రైతులకు ఏ తేదీన కొనుగోలు కేంద్రానికి రావాలో తెలియజేస్తామని పేర్కొన్నారు. కేంద్రానికి వచ్చే రైతులు తమ ఆధార్‌కార్డు, పట్టాదారు పాస్‌బుక్‌, బ్యాంకు పాస్‌బుక్‌ జెరాక్స్‌లు తీసుకొని వస్తే పంట నాణ్యతను పరిశీలించి కొనుగోలు చేస్తామని, 15రోజుల లోపల వారి ఖాతాకు నగదు జమ చేయబడుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో ఎంఈటీ వేణు, సీఈవో మేకల రమణయ్య, ఎం.శ్రీనివాసులురెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, పల్లా మధుసూదన్‌రెడి పాల్గొన్నారు.

=======

Updated Date - 2023-03-25T23:50:19+05:30 IST