నష్టపోయిన రైతులను ఆదుకోండి

ABN , First Publish Date - 2023-03-25T23:03:00+05:30 IST

మండలంలో అకాలవర్షానికి పంట నష్టపోయిన రైతులు తమకు పరిహారం ఇవ్వాలని కోరుతూ శనివారం ఆయా గ్రామాల ఆర్‌బీకేల వద్ద నిరసన తెలిపారు. స్థానిక వీఏఏలకు వినతిపత్రాలు అందించారు. కాగా అంతకుముందు జలదంకి ఏవో బి.శైలజ. ఏఈవో మునెమ్మలు ఆయాగ్రామాల్లో పంటనష్టాన్ని రైతులతో కలిసి శని

 నష్టపోయిన రైతులను ఆదుకోండి
1జలదంకి25: బ్రాహ్మణక్రాక ఆర్‌బీకే ఎదుట ఆందోళన చేస్తున్న రైతులు

జలదంకి, మార్చి25: మండలంలో అకాలవర్షానికి పంట నష్టపోయిన రైతులు తమకు పరిహారం ఇవ్వాలని కోరుతూ శనివారం ఆయా గ్రామాల ఆర్‌బీకేల వద్ద నిరసన తెలిపారు. స్థానిక వీఏఏలకు వినతిపత్రాలు అందించారు. కాగా అంతకుముందు జలదంకి ఏవో బి.శైలజ. ఏఈవో మునెమ్మలు ఆయాగ్రామాల్లో పంటనష్టాన్ని రైతులతో కలిసి శనివారం పరిశీలించి వివరాలు సేకరించారు. రాష్ట్రప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలంటూ రైతుసంఘాలు, అదికారపక్షంతోపాటు ప్రతిపక్ష నేతలు కోరుతున్నారు.

రమణయ్య కుటుంబాన్ని ఆదుకోవాలి

బిట్రగుంట : మండలంలోని పాతబిట్రగుంట దళితవాడకు చెందిన కౌ లు రైతు పరసు రమణయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం జిల్లా నేతలు కోరారు. శనివారం రైతు సంఘ జిల్లా కార్యదర్శి తుళ్ళూరు గోపాల్‌ విలేకరులతో మాట్లాడుతూ పంటనష్టంతో రమణయ్య ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు రాజగోపాల్‌, గోప్సాని రమేష్‌, తాళ్ళూరు మాల్యాద్రి, చల్లా నరహరి, మనోజ్‌, రత్నకుమార్‌ తది తరులు పాల్గొన్నారు.

మాలేపాటి పరామర్శ

దళిత కౌలు రైతు రమణయ్య కుటుంబ సభ్యులను టీడీపీ కావలి నియోజకవర్గ ఇంచార్జి మాలేపాటి సుబ్బానాయుడు శనివారం పరామర్శించి, ఆర్థిక సహాయం అందచేశారు. ఆయన వెంట నాయకులు మాలేపాటి నాగేశ్వరా వు, మన్నం రవిచంద్ర, రావి విజయకుమార్‌యాదవ్‌, పాలకీర్తి శ్రీనివాసులు, పీ హరిబాబు, రమణయ్య తదితరులు ఉన్నారు.

రైతులను ఆదుకోవాలి

వలేటివారిపాలెం : అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్న రైతులను ప్ర భుత్వం వెంటనే ఆదుకోవాలని తెలుగురైతు మండల ప్రధాన కార్యదర్శి గు ర్రం లక్ష్మీనరసింహం తెలిపారు. మండలంలోని శింగమనేనిపల్లె, శాఖవరం, నలదలపూరు, కల్లవళ్ల, పోకూరు తదితర గ్రామాల్లో పొగాకు, శనగ, మిర్చి, వరి తదితర పంటలు వర్షంతో దెబ్బతిన్నట్లు ఆయన చెప్పారు. వెంటనే అధికారులు స్పందించి ప్రభుత్వానికి నివేదికలు పంపి రైతులను ఆదుకోవా ని ఆయన డిమాండ్‌ చేశారు.

Updated Date - 2023-03-25T23:03:00+05:30 IST