వ్యవసాయంలో డ్రోన్‌ల వినియోగంపై అవగాహన

ABN , First Publish Date - 2023-03-25T23:04:28+05:30 IST

వ్యవసాయంలో డ్రోన్‌ల వినియోగం, పురుగుమందుల పిచికారీలో డ్రోన్‌ల వల్ల కలిగే ప్రయోజనాలపై స్థానిక సీటీఆర్‌ఐ, కృషి విజ్ఞానకేంద్రం శాస్త్రవేత్తలు శనివారం రైతులకు అవగాహన నిర్వహించారు. కందుకూరు పొగాకు వేలం కేంద్రాల పరిధిలోని శింగరబొట్లపాలెం, కందులూరు గ్రామాలలోనూ, స్థానిక సీటీఆర్‌ఐ పరిశోధనాకేంద్రం

వ్యవసాయంలో డ్రోన్‌ల వినియోగంపై అవగాహన
25కెడికె4 : రైతులకు అవగాహన కల్పిస్తున్న సీటీఆర్‌ఐ శాస్త్రవేత్తలు

కందుకూరు, మార్చి 25: వ్యవసాయంలో డ్రోన్‌ల వినియోగం, పురుగుమందుల పిచికారీలో డ్రోన్‌ల వల్ల కలిగే ప్రయోజనాలపై స్థానిక సీటీఆర్‌ఐ, కృషి విజ్ఞానకేంద్రం శాస్త్రవేత్తలు శనివారం రైతులకు అవగాహన నిర్వహించారు. కందుకూరు పొగాకు వేలం కేంద్రాల పరిధిలోని శింగరబొట్లపాలెం, కందులూరు గ్రామాలలోనూ, స్థానిక సీటీఆర్‌ఐ పరిశోధనాకేంద్రం ఆవరణలోనూ నిర్వహించిన కార్యక్రమంలో డ్రోన్‌ల వినియోగం గురించి ప్రయోగాత్మకంగా రైతులకు వివరించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టరు ఎల్‌కే ప్రసాదు, డాక్టరు ఎం. అనూరాధ, డాక్టరు కె. గంగాధర్‌, మీనా, పొగాకుబోర్డు, వ్యవసాయ శాఖల అధికారులు, సిబ్బంది, రైతు ప్రతినిధులు శివారెడ్డి, దాశయ్య, రామరాజు, మాధవ, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-25T23:04:28+05:30 IST