రాష్ట్రస్థాయి రెజ్లింగ్‌లో విజేతలుగా గురుకుల విద్యార్థినిలు

ABN , First Publish Date - 2023-09-25T22:41:57+05:30 IST

బోగోలు మండలంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల పాఠశాల విద్యార్థినిలు నలుగురు రాష్ట్రస్థాయి రెజ్లింగ్‌ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారని ప్రిన్సిపాల్‌ పద్మావతి తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ

 రాష్ట్రస్థాయి రెజ్లింగ్‌లో విజేతలుగా గురుకుల విద్యార్థినిలు
2బిటిటిఆర్‌25. జాతీయ స్థాయికి ఎంపికైన విద్యార్థులతో ప్రిన్సిపాల్‌ పద్మావతి

బిట్రగుంట, సెప్టెంబరు 25: బోగోలు మండలంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల పాఠశాల విద్యార్థినిలు నలుగురు రాష్ట్రస్థాయి రెజ్లింగ్‌ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారని ప్రిన్సిపాల్‌ పద్మావతి తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ ఈనెల 21, 22, 23 తేదీల్లో కృష్ణాజిల్లా విజయవాడలోని వికాస్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ వారు పోటీలు నిర్వహించారని తెలిపారు. ఈ పోటీల్లో అండర్‌ 14, 30 కేజీల విభాగంలో 7వ తరగతి విద్యార్థిని వై.దీక్షిత, 58 కేజీల విభాగంలో 9వ తరగతి విద్యార్థిని డి.శ్రీలత బంగారు పతకాలు సాధించారని తెలిపారు. 49 కేజీల విభాగంలో ఆర్‌.మన్విత, 42 కేజీల విభాగంలో 8వ తరగతి విద్యార్థిని శ్యామల ప్రతిభ చూపారని పీడీ ఎన్‌.సులోచన తెలిపారు. విజేతలను వైస్‌ ప్రిన్సిపాల్‌ అనురాధ, ఉపాధ్యాయులు డీ అలివిషా, హౌస్‌ టీచర్లు, సిబ్బంది అభినందించారు.

జాతీయస్థాయి పోటీలకు దీక్షిత, శ్రీలత

విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి రెజ్లింగ్‌ పోటీలో బంగారు పతకాలు సాధించిన వై.దీక్షిత, డి.శ్రీలత జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్‌ తెలిపారు. వీరు అక్టోబరు మొదటి వారంలో మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ లో జరిగే జాతీయ రెజ్లింగ్‌ పోటీలో పాల్గొంటారని తెలిపారు.

---------------

Updated Date - 2023-09-25T22:41:57+05:30 IST