రేపు మధ్యాహ్న భోజన కార్మికుల ‘చలో విజయవాడ’
ABN , First Publish Date - 2023-03-18T23:08:05+05:30 IST
ఈ నెల 20న సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మధ్యాహ్న భోజన కార్మికులు, జిల్లా సీఐటీయూ నాయకుడు మల్లికార్జున పిలుపునిచ్చారు.

బుచ్చిరెడ్డిపాళెం, మార్చి 18: ఈ నెల 20న సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మధ్యాహ్న భోజన కార్మికులు, జిల్లా సీఐటీయూ నాయకుడు మల్లికార్జున పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం బుచ్చిలోని విద్యావనరుల కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేసి ఎంఈవోకు వినతిపత్రం సమర్పించారు. పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండి పెడుతున్న కార్మికుల న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు.