ప్రారంభించారు.. మూతవేశారు..

ABN , First Publish Date - 2023-03-19T23:29:32+05:30 IST

ఉదయగిరి ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో రూ.లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ఏడాదిన్నర క్రితం ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి చేతుల మీదుగా అట్టహాసంగా ప్రారంభించారు. అయితే భవనం ప్రారంభించిన నాటి నుంచి అక్కడ అధికారులు కార్యకలాపాలు నిర్వహించిన పాపానపోలేదు.

ప్రారంభించారు.. మూతవేశారు..
ప్రారంభించి మూసేసిన రైతు భరోసా కేంద్రం

ఉదయగిరి రూరల్‌, మార్చి 19: ఉదయగిరి ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో రూ.లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ఏడాదిన్నర క్రితం ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి చేతుల మీదుగా అట్టహాసంగా ప్రారంభించారు. అయితే భవనం ప్రారంభించిన నాటి నుంచి అక్కడ అధికారులు కార్యకలాపాలు నిర్వహించిన పాపానపోలేదు. అసంపూర్తి పనులతో భవనాన్ని హడావిడిగా ప్రారంభోత్సవం చేశారని, మరుగుదొడ్ల పనులు చేపట్టాల్సి ఉందని అధికారులు తెలుపుతున్నారు. ఏడాదిన్నరగా ఆ పనులు కూడా చేపట్టలేదంటే అధికారుల నిర్లక్ష్యం తేటతెల్లమవుతోంది. ప్రస్తుతం ఆ భవనం అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి భవనాన్ని వాడుకలోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.

============

Updated Date - 2023-03-19T23:29:32+05:30 IST