అన్ని మౌలిక వసతులతో పోలింగ్ కేంద్రాలు
ABN , Publish Date - Dec 30 , 2023 | 11:03 PM
ప్రశాంతంగా ఓటింగ్ నిర్వహించేందుకు పోలింగ్ కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులను ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్ని
బుచ్చిరెడ్డిపాళెం,డిసెంబరు 30: ప్రశాంతంగా ఓటింగ్ నిర్వహించేందుకు పోలింగ్ కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులను ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్నికల అధికారి, జేసీ కూర్మనాథ్ అన్నారు. శనివారం ఆయన ఏఈఆర్‌వోలు, నగర పంచాయతీ కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి, తహసీల్దారు సుధీర్‌తో కలిసి బుచ్చి డీఎల్‌ఎన్‌ఆర్ హైస్కూల్లోని పోలింగ్ కేంద్రాలు, బాలికల ఉన్నత పాఠశాల, శాంతినగర్, ఖాజా నగర్‌లోని పోలింగ్ కేంద్రాలను, జొన్నవాడ, పెనుబల్లి, సాల్మానుపురం గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో మున్సిపాలిటీలో 41, రూరల్ పరిధిలో 37 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ క్రమంలో బుచ్చిలో తనిఖీలు చేసినట్టు తెలిపారు.