Share News

పొగాకు నాట్లు ప్రారంభం

ABN , First Publish Date - 2023-11-06T22:39:21+05:30 IST

మండలంలో నాలుగు రోజులుగా కురుస్తున్న ఓ మోస్తరు వర్షాలకు పలు గ్రామాల్లో పొగాకు నాట్లు ప్రారంభమయ్యాయి.

పొగాకు నాట్లు ప్రారంభం
ఆర్‌ఆర్‌ పాలెంలో వేసిన పొగాకు నాట్లు

లింగసముద్రం, నవంబరు 6 : మండలంలో నాలుగు రోజులుగా కురుస్తున్న ఓ మోస్తరు వర్షాలకు పలు గ్రామాల్లో పొగాకు నాట్లు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం తిమ్మారెడ్డిపాలెం, లింగసముద్రం, విశ్వనాథపురం, వీఆర్‌ కోట, ఆర్‌ఆర్‌ పాలెం, మొగిలిచెర్ల తదితర గ్రామాల్లో పొగ నాట్లు సాగిస్తున్నారు. ఆదివారం రాత్రి మండలంలో 92 మి.మీ వర్షపాతం నమోదైంది. అయితే రెండు నెలలుగా వర్షాలు కురవకపోవడంతో పొగాకు నారు, మిరప నారు సాగు చేసిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అష్టకష్టాలు పడి బోర్లు, బావుల నుంచి పైపుల ద్వారా నీటిని సరఫరా చేసి నారుమడులు కాపాడుకొన్నారు. అయినా వర్షాలు కురవకపోవడంతో అవి ముదిరిపోతున్న తరుణంలో ఓ మోస్తరు వర్షాలు పడుతుండడంతో పొగ నాట్లు, మిరప నాట్లు వేస్తున్నారు. ఈ వర్షాలకు నానిన పొలాలు ఆరితే పొగ నాట్లు ఇంకా ముమ్మరంగా సాగుతాయని రైతులు అంటున్నారు.

Updated Date - 2023-11-06T22:39:23+05:30 IST