పసుపు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి
ABN , First Publish Date - 2023-04-03T21:36:24+05:30 IST
ఉదయగిరి మార్కెట్ యార్డ్‌లో పసుపు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం బండగానిపల్లి సచివాలయంలో రైతులు మం
ఉదయగిరి రూరల్, ఏప్రిల్ 3: ఉదయగిరి మార్కెట్ యార్డ్‌లో పసుపు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం బండగానిపల్లి సచివాలయంలో రైతులు మండల వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు కాకు వెంకటయ్య మాట్లాడుతూ అష్టకష్టాలు పడి సాగు చేసిన పసుపు పంటకు బహిరంగ మార్కెట్‌లో ధర లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి క్వింటం రూ.15 వేల చొప్పున కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు.