పెంచలకోనలో రూ. కోటితో అభివృద్ధి పనులు

ABN , First Publish Date - 2023-01-10T21:29:59+05:30 IST

మండలంలోని పెంచలకోనక్షేత్రంలో రూ. కోటి వ్యయంతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. సామాన్య భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలన్న లక్ష్యంతో ఈ పనులు

 పెంచలకోనలో రూ. కోటితో అభివృద్ధి పనులు
కోనలో నిర్మాణంలో ఉన్న కాటేజీలు

రాపూరు, జనవరి 10: మండలంలోని పెంచలకోనక్షేత్రంలో రూ. కోటి వ్యయంతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. సామాన్య భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలన్న లక్ష్యంతో ఈ పనులు చేపడుతున్నారు. క్షేత్రంలో రెండు చోట్ల విశ్రాంత గదుల నిర్మాణాలు చేపట్టి, నీటి వసతి ఏర్పాటుచేశారు. ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయం ముందు నిరుపయోగంగా ఉన్న పాత భవనాలను ఉపయోగంలోకి తీసుకువచ్చి కాటేజీలు నిర్మిస్తున్నారు. శ్రీవారి ఆలయ గాలిగోపురం పడమరవైపున ఖాళీగా ఉన్న స్థలంలో మండప నిర్మాణాన్ని చేపడుతున్నారు. మార్చిలోగా పనులు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

Updated Date - 2023-01-10T21:30:00+05:30 IST