బద్వేలు-నెల్లూరు రోడ్డుకు 388ఎకరాల సేకరణ
ABN , First Publish Date - 2023-11-21T21:30:49+05:30 IST
బద్వేలు -నెల్లూరు రోడ్డు నిర్మాణానికి సర్వేపల్లి నియోజకవర్గంలో 388 ఎకరాలు సేకరించామని నెల్లూరు ఆర్డీవో మాలోల తెలిపారు. స్థానిక వైకేపీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మంగళవారం 3వదఫా రోడ్డు అవార్డు

ఆర్డీవో మాలోల
మనుబోలు, నవంబరు 21: బద్వేలు -నెల్లూరు రోడ్డు నిర్మాణానికి సర్వేపల్లి నియోజకవర్గంలో 388 ఎకరాలు సేకరించామని నెల్లూరు ఆర్డీవో మాలోల తెలిపారు. స్థానిక వైకేపీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మంగళవారం 3వదఫా రోడ్డు అవార్డు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో భూములు కోల్పోయిన రైతులకు భూసేకరణ గురించి అవగాహన కల్పించారు. పలువురు రైతులు మాట్లాడుతూ రికార్డులు, సర్వేలో తమ భూమిని తక్కువగా చూపడంతో పరిహారం పూర్తిగా రాలేదని, రికార్డుల్లో తప్పులున్నాయంటూ ఆర్డీవోకి ఫిర్యాదు చేశారు. ఆర్డీవో మాట్లాడుతూ నియోజకవర్గంలోని పొదలకూరు, మనుబోలు, వెంకటాచలం మండలాల్లో మొదటి విడతగా 220ఎకరాలు గుర్తించి, నష్టపరిహారం అందించామన్నారు. ఇప్పుడు 168ఎకరాలు గుర్తించి వారికి నోటీసులు ఇచ్చామన్నారు. రైతుల వద్దనున్న వివరాలు తీసుకుని సర్వే ప్రకారం సరిచూస్తామన్నారు. ఈ విడతలో భూమితోపాటు, దానిపైనున్న ఆస్తికి నష్టపరిహారం ఒకేదఫా ఇచ్చేలా చర్యలు తీసుకున్నామన్నారు. భూ సేకరణపై రైతులు ఫిర్యాదులు, అభ్యంతరాలు తెలపవచ్చునన్నారు. నాలుగురోజుల్లోగా మాత్రమే ఫిర్యాదు చేయాలన్నారు అనంతరం వీఆర్‌వో బుజ్జయ్యపై వడ్లపూడి రైతులు ఆర్డీవోకి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో రీసర్వే డీటీ శివప్రసాద్, వీఆర్‌వోలు బుజ్జయ్య, అఖిల్, శ్రీనువాసులు, మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.
--------