నిత్యావసరాల పంపిణీ
ABN , First Publish Date - 2023-12-05T23:04:12+05:30 IST
మండలంలోని కొత్తపల్లి ఎస్టీ కాలనీలో ఉంటూ తుఫాన్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి మంగళవారం తహసీల్దారు శ్రీనివాసులురెడ్డి, వీఆర్వో అంజాద్ నిత్యావసర సరుకులు, దుప్పట్లు పంపిణీ చేశారు. అలాగే వారిని బిజ్జంపల్లి ఉన్నత పాఠశాలకు తరలించగా సీపీఎం నాయకులు కాకు. వెంకటయ్య, ఎంపీటీసీ కాకు. విజయమ్మ భోజనం ఏర్పా
ఉదయగిరిరూరల్, డిసెంబరు 5: మండలంలోని కొత్తపల్లి ఎస్టీ కాలనీలో ఉంటూ తుఫాన్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి మంగళవారం తహసీల్దారు శ్రీనివాసులురెడ్డి, వీఆర్వో అంజాద్ నిత్యావసర సరుకులు, దుప్పట్లు పంపిణీ చేశారు. అలాగే వారిని బిజ్జంపల్లి ఉన్నత పాఠశాలకు తరలించగా సీపీఎం నాయకులు కాకు. వెంకటయ్య, ఎంపీటీసీ కాకు. విజయమ్మ భోజనం ఏర్పాటు చేశారు.
బాధితులకు చేయూత
వరదల్లో చిక్కుకొని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు మంగళవారం స్ధానిక శ్యామేలు మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. ఎస్టీ కాలనీలోని పూరి గుడిసెల్లోకి నీరు చేరడంతో వంట చేసుకొనే అవకాశం కూడా లేకుండా పోయింది. సమాచారం అందుకున్న ట్రస్టు చైర్మన్లు తాతపూడి రాజశేఖర్, కళావతి దంపతులు కాలనీని సందర్శించి 30 కుటుంబాలకు అన్నదానం చేశారు. వైసీపీ ఎస్సీ సెల్ నేత తాతపూడి తేజానిహాంత్ తదితరులు పాల్గొన్నారు.