నేటి నుంచి వందేభారత్‌ రైలు

ABN , First Publish Date - 2023-09-24T00:05:19+05:30 IST

విజయవాడ-చెన్నైల మధ్య తొలిసారిగా వందేభారత్‌ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. ఆదివారం ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌గా ఈ రైలును ప్రారంభించ నున్నట్లు విజయవాడ డివిజన్‌ రైల్వే పీఆర్‌వో మండ్రుప్కర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

 నేటి నుంచి వందేభారత్‌ రైలు

విజయవాడ, చెన్నై మధ్య పరుగులు

రేపటి నుంచి రెగ్యులర్‌ సర్వీసులు

నెల్లూరు స్టేషన్‌లో మాత్రమే స్టాపింగ్‌

వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని

నెల్లూరు (వెంకటేశ్వరపురం), సెప్టెంబరు 23: విజయవాడ-చెన్నైల మధ్య తొలిసారిగా వందేభారత్‌ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. ఆదివారం ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌గా ఈ రైలును ప్రారంభించ నున్నట్లు విజయవాడ డివిజన్‌ రైల్వే పీఆర్‌వో మండ్రుప్కర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 20677 రైలు చెన్నై నుంచి ఉదయం 5.30 గంటలకు బయలుదేరి రేణిగుంటకు 7.05 , నెల్లూరుకు 8.39, ఒంగోలుకు 10.09, తెనాలికి 11.21, విజయవాడ 12.10 గంటలకు చేరుతుందని తెలిపారు. అదే విధంగా 20678 రైలు విజయవాడలో మఽధ్యాహ్నం 3.20కి బయలుదేరి తెనాలికి 3.49, ఒంగోలుకు 5.03, నెల్లూరుకి 6.19 , రేణుగుంటకు 8.05, చెన్నై సెంట్రల్‌కు రాత్రి 10.00 గంటలకు చేరుతుందని ఆయన వివరించారు. ఈ రైలులో మొత్తం 8 కోచ్‌లు ఉన్నాయని, వాటిలో ఏడు ఏసీ చైర్‌కార్‌ కోచ్‌లు కాగా, ఒకటి ఎగ్జిక్యూటివ్‌ చైర్‌కార్‌ కోచ్‌ అని వివరించారు. విజయవాడ నుంచి చెన్నై సెంట్రల్‌కు ఏసీ కార్‌చైర్‌ చార్జీ రూ.1,420, ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ ధర రూ. 2,630 గా నిర్ణయించారని తెలిపారు. చెన్నై సెంట్రల్‌ నుంచి విజయవాడకు ఏసీ కార్‌చైర్‌ ధర రూ.1,320, ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ ధర రూ. 2,540గా నిర్ణయించారు. రాకపోకల సందర్భంగా ప్రయాణించే ట్రాక్‌ల బట్టి చార్జీలతో తేడాలుంటాయన్నారు. క్యాటరింగ్‌తో కలుపుకొని ఈ ధరలు ఉంటాయన్నారు. క్యాటరింగ్‌ మినహాయిస్తే రూ. 300 వరకు తగ్గుతాయని తెలిపారు. విజయవాడ నుంచి చెన్నైకు 6.40 గంటల్లో చేరుకోవచ్చన్నారు. ప్రయాణికులు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ ద్వారా రిజర్వేషన్‌ చేసుకోవచ్చని పీఆర్‌వో తెలిపారు.

--------------

Updated Date - 2023-09-24T00:05:53+05:30 IST