నాణ్యత లేని వస్తువులపై నిఘా

ABN , First Publish Date - 2023-03-19T23:33:18+05:30 IST

మండలంలోని దుకాణదారులు విక్రయిస్తున్న నాణ్యత లేని వస్తువులపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు ఏపీ కన్జ్యూమర్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ ఫోరం ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడు చల్లగాలి వెంకట మోహన్‌ అన్నారు.

నాణ్యత లేని వస్తువులపై నిఘా

వరికుంటపాడు, మార్చి 19: మండలంలోని దుకాణదారులు విక్రయిస్తున్న నాణ్యత లేని వస్తువులపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు ఏపీ కన్జ్యూమర్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ ఫోరం ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడు చల్లగాలి వెంకట మోహన్‌ అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ నాణ్యత, గడువు లేని వస్తువుల నియంత్రణకు ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. అలాగే కొనుగోలు సమయంలో వినియోగదారులు తప్పనిసరిగా తయారీ తేదీ, గడువును పరిశీలించాలని సూచించారు. గతంలో పలుమార్లు హెచ్చరించినప్పటికీ కొంతమంది వ్యాపారుల ధోరణిలో ఎలాంటి మార్పు లేదన్నారు. సమగ్రంగా పరిశీలించి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సభ్యులు డీ మహేష్‌, బీ శివారెడ్డి, వై చెన్నకృష్ణయ్య, వై సూర్యనారాయణ, ఎస్‌.మధుకృష్ణ పాల్గొన్నారు.

==========

Updated Date - 2023-03-19T23:33:18+05:30 IST