Share News

మున్సిపల్‌ కార్మికుల సమ్మె

ABN , First Publish Date - 2023-11-10T22:35:52+05:30 IST

మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్మికులు తమ సమస్యలు పరిష్కారం కోసం శుక్రవారం కావలిలో సమ్మె చేపట్టారు.

మున్సిపల్‌ కార్మికుల సమ్మె
మున్సిపల్‌ కార్యాలయం వద్ద సమ్మెలో పాల్గొన్న మున్సిపల్‌ కార్మికులు

కావలి, నవంబరు 10: మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్మికులు తమ సమస్యలు పరిష్కారం కోసం శుక్రవారం కావలిలో సమ్మె చేపట్టారు. 5 నెలలుగా దినసరివేతన కూలీలకు జీతాలు ఇవ్వాలని, రక్షణసామగ్రి అందించాలని కార్మికుల డిమాండ్లపై అధికారులు స్పందించకపోవడంతో వారు విధులను బహిష్కరించి మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ఆందోళ చేపట్టి సమస్యలు పరిష్కరించే వరకు సమ్మెను కొనసాగిస్తామని చెప్పారు. సీపీఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య, కావలి నియోజకవర్గ కార్యదర్శి కొప్పర్తి నాగరాజు, వ్యవసాయకార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు దమ్ము దర్గా బాబు తదితర నేతలు వచ్చి కార్మికులకు సంఘీభావం తెలిపారు. దీంతో స్పందించిన మున్సిపల్‌ కమిషనర్‌ శ్రావణ్‌కుమార్‌ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో కార్మికులు సమ్మెను విరమించుకుని మధ్యాహ్నం నుంచి విధులకు వెళ్లారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షుడు మల్లి అంకయ్య, పట్టణ అధ్యక్షుడు ఆదినారాయణ, గుంజి కిషోర్‌, తన్నీరు వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-10T22:35:54+05:30 IST