మైనింగ్ ప్రాజెక్టులపై ప్రజాభిప్రాయ సేకరణ
ABN , First Publish Date - 2023-03-18T22:23:18+05:30 IST
మండలంలోని తురిమెర్లలో సబ్ లైమ్ ఎక్స్‌పోర్ట్స్, మైకా మైన్స్ ప్రాజెక్టులపై శనివారం పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఈ సందర్భంగా జేసీ ఆర్ కూర్మనాథ్ మాట్లాడుతూ తురిమెర్ల గ్రామ సర్వే నెంబర్ 295,296,490ఏ, 492 నుంచి 498, 508,509పి,510పీ వరకు ఓపెన్ కాస్ట్ పద్ధతిలో 29,226 హెక్టార్ల విస్తీర్ణంలో చేపట్టే 6,0

సైదాపురం,మార్చి18: మండలంలోని తురిమెర్లలో సబ్ లైమ్ ఎక్స్‌పోర్ట్స్, మైకా మైన్స్ ప్రాజెక్టులపై శనివారం పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఈ సందర్భంగా జేసీ ఆర్ కూర్మనాథ్ మాట్లాడుతూ తురిమెర్ల గ్రామ సర్వే నెంబర్ 295,296,490ఏ, 492 నుంచి 498, 508,509పి,510పీ వరకు ఓపెన్ కాస్ట్ పద్ధతిలో 29,226 హెక్టార్ల విస్తీర్ణంలో చేపట్టే 6,052టీపీఏ(టన్స్‌ఫర్ యానం) మైకా, 7,566టీపీఏ క్వార్జ్, 30,262 ఫెల్డ్‌స్పార్, సర్వేనెంబర్ 499పీ,500,501పీ,502పీలో ఓపెన్ కాస్ట్ పద్ధతిన 7.0హెక్టార్లలో చేపట్టే 31,528టీపీఏ మైకా,క్వార్జ్, ఫెల్డ్ స్పార్ మైనింగ్ ప్రాజెక్టు అనుమతుల కోసం ప్రజాభిప్రాయ సేకరణలో తమ దృష్టికి వచ్చిన అంశాలపై నివేదికను ఉన్నతాధికారులకు అందచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పర్యావరణ శాఖాధికారి రాజశేఖర్, తహసీల్దార్ విజయలక్ష్మి, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ నాగబాబు, మైనింగ్ ఓనర్లు సురేష్‌రెడ్డి, ప్రణయ్‌రెడ్డి, ఎన్జీవోలు, తదితరులు పాల్గొన్నారు.