రోగులకు మెరుగైన వైద్యసేవలందించండి
ABN , First Publish Date - 2023-02-21T21:11:23+05:30 IST
: ప్రభుత్వ వైద్యశాలలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా అదనపు వైద్యఆరోగ్య శాఖాధికారి జీ.వెంకటప్రసాద్ తెలిపారు.
ఉదయగిరి రూరల్, ఫిబ్రవరి 21: ప్రభుత్వ వైద్యశాలలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా అదనపు వైద్యఆరోగ్య శాఖాధికారి జీ.వెంకటప్రసాద్ తెలిపారు. మండలంలోని గండిపాళెంలో మరమ్మతులు పూర్తి చేసుకొన్న పీహెచ్‌సీ భవనాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ త్వరలో మరమ్మతులు పూర్తి చేసుకున్న భవనంలో రోగులకు వైద్యసేవలు అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్యులు శిలకల్పన, వినీత, సీహెచ్‌వో శివకుమారి, హెచ్‌ఈ వెంకటసుబ్బయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.