మట్టి అక్రమ రవాణాపై విచారణకు ఆదేశం
ABN , First Publish Date - 2023-08-26T22:48:25+05:30 IST
: మండలంలోని గంగపట్నంలో ఇటీవల మట్టి మాఫియా, ప్రైవేటు లే అవుట్లకు విచ్చలవిడిగా మట్టిని అక్రమంగా రవాణా చే
ఇందుకూరుపేట, ఆగస్టు 26: మండలంలోని గంగపట్నంలో ఇటీవల మట్టి మాఫియా, ప్రైవేటు లే అవుట్లకు విచ్చలవిడిగా మట్టిని అక్రమంగా రవాణా చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్థానికులు స్పందనలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలో శనివారం మైనింగ్ అధికారులు ప్రైవేటు లేఅవుట్లను సందర్శించి మట్టిని ఎంత వరకు అక్రమ రవాణా చేశారనేదానిపై కొలతలు సేకరించారు. కాగా మైనింగ్ అధికారులకు స్థానిక రెవెన్యూ సిబ్బంది సహకరించకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తున్నదని గ్రామస్థులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మైనింగ్ ఇన్‌స్పెక్టర్ దేవిసింగ్, టెక్నికల్ అసిస్టెంట్ హసీనాబాను, తదితరులు పాల్గొన్నారు.