మఠం అభివృద్ధికి చేయూతనివ్వండి

ABN , First Publish Date - 2023-03-25T23:45:59+05:30 IST

మండలంలోని పొన్నపూడి కాలనీలో ఉన్న రమణయ్య స్వామి మఠం అభివృద్ధికి ప్రభుత్వం చేయూత నివ్వాలని మఠం పీఠాధిపతి కొమరగిరి రామయ్య కోరారు.

మఠం అభివృద్ధికి చేయూతనివ్వండి
సమావే శంలో మాట్లాడుతున్న మఠం ట్రస్టు సభ్యులు

విడవలూరు, మార్చి 25: మండలంలోని పొన్నపూడి కాలనీలో ఉన్న రమణయ్య స్వామి మఠం అభివృద్ధికి ప్రభుత్వం చేయూత నివ్వాలని మఠం పీఠాధిపతి కొమరగిరి రామయ్య కోరారు. పొన్నపూడిలో శనివారం జరిగిన కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుమారు 100ఏళ్ల క్రితం హిందూ మత ప్రచారకులు, ఆధ్యాత్మిక వేత్త రమణయ్య మరణానంతరం ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. సుమారు 600పైగా సభ్యులు ఉన్న మఠం ప్రస్తుతం దీనావస్థలో ఉందన్నారు. చుట్టూ ప్రహరీ లేకపోవటంతో మఠంలో ఉన్న శివుడి ఆలయానికి, శ్రీకృష్ణుడి విగ్రహాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. అదేవిదంగా మఠానికి వచ్చే రహదారి ఆధ్వానంగా ఉందన్నారు. ప్రతి శనివారం మఠంలో ఆన్నదానం జరుగుతుందని, అయితే సరిపడ నిధులు లేనందున మఠానికి వచ్చే భక్తులకు సరైన భోజన సౌకర్యాలు కల్పించలేకుండా ఉన్నామని తెలిపారు. ఈ క్రమంలో మఠం అభివృద్ధికి ప్రభుత్వం, దాతలు విరాళాలు అందజేయాలని కోరారు. సమావేశంలో రమణయ్య స్వామి మఠం ట్రస్టు అధ్యక్షుడు మర్రిబోయిన యానాదయ్య, ఉపాధ్యక్షుడు తుపాకుల శంకరయ్య, కార్యదర్శి ఊటుకూరు చంద్రయ్య, ట్రెజరర్‌ కవరగిరి మణిస్వామి, దళిత సంఘం నాయకులు శ్రీధర్‌, ఏడుకొండలు, శివకుమార్‌ పాల్గొన్నారు.

========

Updated Date - 2023-03-25T23:45:59+05:30 IST