అర్భన్ మార్కెట్ ఏర్పాటు హర్షణీయం
ABN , First Publish Date - 2023-09-21T21:50:14+05:30 IST
: బుచ్చి నగర పంచాయతీలో తొలిసారిగా జగనన్న అర్భన్ మార్కెట్ ఏర్పాటు చేయడం హర్షణీయమని చైర్‌పర్సన్
బుచ్చిరెడ్డిపాళెం,సెప్టెంబరు21: బుచ్చి నగర పంచాయతీలో తొలిసారిగా జగనన్న అర్భన్ మార్కెట్ ఏర్పాటు చేయడం హర్షణీయమని చైర్‌పర్సన్ మోర్ల సుప్రజ అన్నారు. గురువారం నగర పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మార్కెట్‌ను ఆమె ప్రారంభించారు. అనంతరం మార్కెట్‌లో పొదుపు మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మెప్మా పీడీ డాక్టర్ రవీంద్ర, సతీష్‌రెడ్డి, సీవో నర్మద, ఏపీఎం లలిత, సీఎంఎం హర్షిత తదితరులు పాల్గొన్నారు.
-----------