బుచ్చిలో మందుబాబుల ఘర్షణ
ABN , First Publish Date - 2023-04-22T21:35:56+05:30 IST
బుచ్చిలోని చెల్లాయపాళెం రోడ్డు సమీపంలో జాతీయ రహదారి పక్కన ఓ లేఅవుట్‌లో మందుబాబులు శనివారం ఘర్షణకు దిగారు. దీంతో ఆ మార్గంలోని ప్రయాణికులు భయాం
బుచ్చిరెడ్డిపాళెం,ఏప్రిల్22: బుచ్చిలోని చెల్లాయపాళెం రోడ్డు సమీపంలో జాతీయ రహదారి పక్కన ఓ లేఅవుట్‌లో మందుబాబులు శనివారం ఘర్షణకు దిగారు. దీంతో ఆ మార్గంలోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రంజాన్ సందర్భంగా బుచ్చి, మినగల్లుకు చెందిన ముస్లిం యువకులకు, రేబాలకు చెందిన యువకుల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో రేబాలకు చెందిన యువకులు తమపై దాడి చేసి వెళ్లిపోయారని మినగల్లు, ఖాజానగర్‌కు చెందిన ముస్లింలు చెబుతుండగా, మినగల్లు, ఖాజానగర్ యువకులే రేబాల యువకుడిపై దాడి చేశారని బాధితులు పేర్కొన్నారు. మొత్తానికి ఇరువర్గాలు ఎందుకు ఘర్షణ పడ్డారో తెలియదు. స్థానికుల సమాచారంతో ఇరువర్గాలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
----------