మానవ అక్రమ రవాణాపై అవగాహన

ABN , First Publish Date - 2023-09-25T22:43:30+05:30 IST

స్వచ్ఛంద సేవాసంస్థల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమవారం పాతూరులోని శ్రీచైతన్య జూనియర్‌ కళాశాలలో మానవ అక్రమ రవాణాపై అవగాహన సదస్సు జరిగింది. వేదిక గౌరవాధ్యక్షుడు ఖాదర్‌బాష మాట్లాడుతూ ఉద్యోగాలు, ప్రేమ, పెళ్లి, ఇతర ఆకర్షణలు, ప్రలోభాలకు గురిచేసి కొందరు మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని, వీ

మానవ అక్రమ రవాణాపై అవగాహన
25కెవిఎల్‌ 2: విద్యార్థులకు అవగాహన కల్పిస్నున్న నిర్వాహకులు

కావలిటౌన్‌, సెప్టెంబరు25: స్వచ్ఛంద సేవాసంస్థల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమవారం పాతూరులోని శ్రీచైతన్య జూనియర్‌ కళాశాలలో మానవ అక్రమ రవాణాపై అవగాహన సదస్సు జరిగింది. వేదిక గౌరవాధ్యక్షుడు ఖాదర్‌బాష మాట్లాడుతూ ఉద్యోగాలు, ప్రేమ, పెళ్లి, ఇతర ఆకర్షణలు, ప్రలోభాలకు గురిచేసి కొందరు మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని, వీరి పట్ట అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్‌ వెంకయ్య, స్వచ్ఛంద సంస్ధల ప్రతినిధులు ఖాదర్‌బీ, జమీర్‌, ఎస్‌కె రఫీ, కొండయ్య, రాయపాటి దిలీప్‌, ప్రసాదరావు, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-25T22:43:36+05:30 IST