అదాని కృష్ణపట్నం పోర్టులో ‘స్వచ్ఛభారత్‌’

ABN , First Publish Date - 2023-06-07T23:59:04+05:30 IST

అదాని కృష్ణపట్నం పోర్టు ఆధ్వర్యంలో బుధవారం గోపాలపురంలోని సీవీఆర్‌ కాంప్లెక్స్‌లో స్వచ్ఛభారత్‌ కార్యక్రమం నిర్వహించారు.

అదాని కృష్ణపట్నం పోర్టులో ‘స్వచ్ఛభారత్‌’
పరిసరాలను శుభ్రపరుస్తున్న అడ్మిన్‌ హెడ్‌ గణేష్‌శర్మ

ముత్తుకూరు, జూన్‌ 7 : అదాని కృష్ణపట్నం పోర్టు ఆధ్వర్యంలో బుధవారం గోపాలపురంలోని సీవీఆర్‌ కాంప్లెక్స్‌లో స్వచ్ఛభారత్‌ కార్యక్రమం నిర్వహించారు. పరిసరాలు పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టామని అదాని కృష్ణపట్నం పోర్టు అడ్మిన్‌ హెడ్‌ గణేశ్‌శర్మ తెలిపారు. పోర్టు ఉద్యోగులు, కార్మికుల ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో భాగంగా చెత్తను తొలగించామన్నారు. పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవడం వలన కాలుష్య నివారణతోపాటు వ్యాధులు సోకకుండా ఉండేందుకు స్వచ్ఛభారత్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అడ్మిన్‌ ఏజీఎం గంగా సతీష్‌, సెక్యూరిటీ డీజీఎం మనోహర్‌బాబు, వాటర్‌ డిపార్ట్‌మెంట్‌ అసోసియేట్‌ మేనేజర్‌ శివ, పుచ్చలపల్లి శ్రీనివాసులు, అపర్ణ, రాజేష్‌యాదవ్‌, నాగేశ్వరరావు, పద్మావతి, గంగాధర్‌రెడ్డి, డి.రామకృష్ణ, బాషా, తదితరులు పాల్గొన్నారు.

=======

Updated Date - 2023-06-07T23:59:04+05:30 IST